Game Changer | దసరాకి ‘గేమ్ ఛేంజర్’ టీజర్ లేనట్లే.. మెగా అభిమానికి థమన్ రిప్లయ్.!
Game Changer | రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు రూపొందించిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ప్రచార పర్వంలో భాగంగా ఇటీవలే రెండో పాటను విడుదల చేశారు.
Game Changer | రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురాబోతున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో దిల్‌రాజు రూపొందించిన ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ప్రచార పర్వంలో భాగంగా ఇటీవలే రెండో పాటను విడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించడంతో టీజర్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెలలోనే టీజర్‌ను రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్‌రాజు కన్ఫర్మ్ చేశారు.
అయితే ‘గేమ్ ఛేంజర్’ టీజర్ ఎప్పుడు వస్తుందంటూ సంగీత దర్శకుడు థమన్‌ను ఎక్స్ వేదికగా ఒక అభిమాని అడిగాడు. టీజర్ మీద దృష్టి పెట్టండి.. సాంగ్స్ తర్వాత విడుదల చేస్తారు అంటూ థమన్‌ను ట్యాగ్ చేశాడు. దీనికి థమన్ సమాధానమిస్తూ.. డియర్ బ్రదర్ మీ బాధ మాకు అర్థమవుతుంది. కానీ ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం కాంప్రమైజ్ కాకుండా పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే వీటికి టీజర్ బ్రేక్ వేస్తుంది. మేము ఎంత వేగంగా చేసిని దసరా వరకు అవ్వకపోతే.. దీపావళికి ఖచ్చితంగా బ్లాస్ట్ ఉంటుంది. మేము కూడా దీన్ని పార్క్ నుంచి బయటకు కొట్టాలి అనుకుంటున్నాం. దీనికోసం అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. అంటూ థమన్ రాసుకోచ్చాడు.
Bro @TweetRamCharan WE understand
But The film is so huge Post Production Activities are on Larger Scale For Uncompromising Outputs ..
this teasers and content delivers are putting Brakes
With the flow Duseerah ki kaalapothee Diwali blast Untundhiiii 💥💥💥💥🧨
We also Want to… https://t.co/AQbRvUSWdQ— thaman S (@MusicThaman) October 8, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

