Thalapathy67 | విజయ్-లోకేష్ మూవీ షూటింగ్ ప్రారంభం.. ఆ పండగే టార్గెట్..!
'విక్రమ్' సినిమాతో లోకేష్ పేరు దక్షిణాదిన మార్మోగిపోయింది. కమల్ హాసన్ వంటి సీనియర్ హీరోను పెట్టి రూ.400కోట్లు సాధించాడంటే మాములు విషయం కాదు. కేవలం తమిళంలోనే కాదు రిలీజైన అన్ని భాషల్లోనూ ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది.
Thalapathy67 Movie Shooting Starts | ‘విక్రమ్’ సినిమాతో లోకేష్ పేరు దక్షిణాదిన మార్మోగిపోయింది. కమల్ హాసన్ వంటి సీనియర్ హీరోను పెట్టి రూ.400కోట్లు సాధించాడంటే మాములు విషయం కాదు. కేవలం తమిళంలోనే కాదు రిలీజైన అన్ని భాషల్లోనూ ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఇక ప్రస్తుతం లోకేష్, దళపతి విజయ్‌తో సినిమా చేస్తున్నాడు. ‘మాస్టర్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబోలో సినిమా తెరకెక్కనుండటంతో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. పైగా లోకేష్ సినిమాటిక్‌లో భాగంగా ఈ మూవీ రూపొందుతుండటంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది.
ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా అని విజయ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా సోమవారం ఈ సినిమా షూటింగ్ చెన్నైలో ప్రారంభమైంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనుంది. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడని టాక్. అర్జున్, ప్రియా ఆనంద్ కీలకపాత్రల్లో నటిస్తున్నారని సమాచారం. విక్రమ్‌తో విధ్వంసం సృష్టించిన లోకేష్ కనగరాజు.. ఈ చిత్రంతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా త్రిష నటిస్తుంది. ఈ సినిమాను వీలైతే ఇదే ఏడాది దీపావళికి లేదంటే వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారట చిత్రబృందం.
Read Also:
Shakunthalam | శాకుంతలం రిలీజ్ డేట్‌పై సమంత అభిమానులు అసంతృప్తి.. దిల్‌రాజు ఇలా చేశాడేంటి..!
Project-k Movie | వీల్ వీడియోతో ప్రాజెక్ట్-K సంచలనం.. నైజాం నుండి కోట్లలో ఆఫర్..!
Dhamaka Movie | రాజమౌళి తర్వాత రవితేజనే.. ధమాకాతో మాస్ మహరాజా సరికొత్త రికార్డు
Allari Naresh | అల్లరి నరేష్ ఉగ్రం బిగ్ అప్డేట్.. నాంది మేజిక్ రిపీట్ అవుతుందా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

