Project-k Movie | ప్రభాస్ హీరోగా పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రాజెక్ట్-K’. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. ముందు నుండి మేకర్స్ ఈ సినిమాను ఇంటర్నేషనల్ లెవల్లో రూపొందిస్తున్నట్లు చెబుతూనే వస్తున్నారు. దానికి తగ్గట్లే ఈ సినిమా కోసంకొత్తగా కార్లు వంటివి తయారు చేస్తున్నారు. ఇక ఇటీవలే రీఇన్వెంటింగ్ ది వీల్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఒక్క టైరు కోసం చిత్రయూనిట్ ఎంత కష్టపడిందో ఆ వీడియోలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ వీల్ సహాయంతోనే ప్రభాస్ టైమ్ ట్రావెల్ చేయబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఇటీవలే రిలీజైన వీడియోకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. దాంతో అదే ఊపులో ఈ సినిమా కోసం భారీగా ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తుంది. కాగా కేవలం నైజాంలోనే ఈ సినిమాకు రూ.70 కోట్ల వరకు ఏషియన్ సునీల్ ఆఫర్ చేసినట్లు టాక్. మరి ఇందులో నిజమెంతుదో తెలియాంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. షూటింగ్ దశలోనే ఈ రేంజ్ ధర పలుకుతుందంటే విశేషం అనే చెప్పాలి. పైగా ప్రభాస్‌కు రెండు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు కూడా ఉన్నాయి. అయినాగానీ ఈ స్థాయిలో బిజినెస్ అంటే కంటెంట్‌పై ఉన్న నమ్మకమనే చెప్పాలి.
ఇప్పటి వరకు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. కానీ నాగ్ అశ్విన్ ఈ సినిమాను సరికొత్త రీతిలో ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నట్లు టాక్. పైగా ఈ సినిమాలో సింగీతం శ్రీనివాస్ రావు భాగం కావడంతో ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీపికా పదుకునే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. వైజయంతీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ కానుంది.
Read Also:
Shakunthalam | శాకుంతలం రిలీజ్ డేట్‌పై సమంత అభిమానులు అసంతృప్తి.. దిల్‌రాజు ఇలా చేశాడేంటి..!
Vaishnav Tej | వారం గ్యాప్‌లో మెగా మేనళ్లుల పోటీ.. వైష్ణవ్‌తేజ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్