Allari Naresh | అల్లరి నరేష్ ఉగ్రం బిగ్ అప్డేట్.. నాంది మేజిక్ రిపీట్ అవుతుందా?
'నాంది'తో నరేష్‌లోని కొత్త నటుడు బయటకు వచ్చాడు. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న అల్లరోడు.. నాంది సినిమాలో సీరియస్ పాత్ర పోషించి ప్రేక్షకులతో జైజైలు కొట్టించుకున్నాడు. అంతకు ముందు 'నేను', 'విశాఖ ఎక్స్‌ప్రెస్' వంటి సినిమాల్లో సీరియస్ పాత్రలు పోషించిన..
Ugram Movie | ‘నాంది’తో నరేష్‌లోని కొత్త నటుడు బయటకు వచ్చాడు. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న అల్లరోడు.. నాంది సినిమాలో సీరియస్ పాత్ర పోషించి ప్రేక్షకులతో జైజైలు కొట్టించుకున్నాడు. అంతకు ముందు ‘నేను’, ‘విశాఖ ఎక్స్‌ప్రెస్’ వంటి సినిమాల్లో సీరియస్ పాత్రలు పోషించిన.. నరేష్‌కు ఈ స్థాయిలో గుర్తింపు రాలేదు. ఎంతో కాలంగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న అల్లరి నరేష్‌కు ఈ సినిమా మంచి విజయం సాధించడమే కాకుండా ఆయన మార్కెట్ పెంచింది. ఇక దర్శకుడిగా విజయ్ కనకమేడల వందకు వంద మార్కులు కొట్టేశాడు.
ఇదే కాంబోలో ‘ఉగ్రం’ అనే రెండో సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే సగం షూటింగ్ కూడా పూర్తయింది. గతేడాది ద్వితియార్థంలో రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. పోస్టర్‌తోనే అప్పుడే సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ను నరేష్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఈ మూవీకి బిగ్ అనౌన్స్‌మెంట్‌ను మంగళవారం సాయంత్రం 4గంటలకు ప్రకటించనున్నట్లు నరేష్ వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే సినిమా రిలీజ్ డేట్ అని తెలుస్తుంది.
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ధి నిర్మిస్తున్నారు. నరేష్‌కు జోడీగా మిర్నా మీనన్ నటిస్తుంది. శ్రీచరణ్ పాకాలా సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు రాస్తున్నాడు.
4.00pm tomorrow…expect the unexpected 😏💥 #Ugram
Stay Tuned⏳#NareshVijay2 @allarinaresh @mirnaaofficial @DirVijayK @sahugarapati7 @harish_peddi @Shine_Screens @Sid_dop @SricharanPakala @brahmakadali @chotakprasad @abburiravi pic.twitter.com/3ZmXNsTk6b
— Allari Naresh (@allarinaresh) January 2, 2023
Read Also:
Project-k Movie | వీల్ వీడియోతో ప్రాజెక్ట్-K సంచలనం.. నైజాం నుండి కోట్లలో ఆఫర్..!
Shakunthalam | శాకుంతలం రిలీజ్ డేట్‌పై సమంత అభిమానులు అసంతృప్తి.. దిల్‌రాజు ఇలా చేశాడేంటి..!
Vaishnav Tej | వారం గ్యాప్‌లో మెగా మేనళ్లుల పోటీ.. వైష్ణవ్‌తేజ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
Dhamaka Movie | రాజమౌళి తర్వాత రవితేజనే.. ధమాకాతో మాస్ మహరాజా సరికొత్త రికార్డు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

