Dhamaka Movie Creates New Record | ‘క్రాక్’ వంటి భారీ హిట్టు తర్వాత వచ్చిన ‘ఖిలాడీ’ క్రాక్‌లో పావు వంతు కలెక్షన్లు కూడా సాధించలేకపోయింది. హిట్టు తర్వాత ఓ ఫ్లాపు సాధారణమే అనుకుంటే.. ఆ తర్వాత రవితేజ ఎంతో కష్టపడి చేసిన ‘రామారావు’ మొదటి రోజే ముసుగు తన్నేసింది. రవన్న కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలింది. ఇలా రెండు డిజాస్టర్ల తర్వాత అంతంత మాత్రపు అంచనాలతో రిలీజైన ‘ధమాకా’ ఫస్ట్ డేనే నెగెటీవ్ టాక్ తెచ్చుకుంది. కథ పాతదని, కథనంలో కొత్తదనం లేదని, పర్ఫార్మెన్స్ పేలవంగా ఉన్నాయని బోలెడన్ని నెగెటీవ్ రివ్యూలు వచ్చాయి. కట్ చేస్తే రవితేజ కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ధమాకా నిలిచింది.
మొదటి రోజుకు మించి రెండో రోజు.. రెండో రోజుకు మించి మూడో రోజు ఇలా రోజు రోజుకు ధమాకా సినిమాకు ఆదరణ పెరుగుతూనే ఉంది. పైగా పోటీగా ఏ సినిమా లేకపోవడంతో ధమాకా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.89 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి వంద కోట్ల దిశగా పరుగులు పెడుతుంది. కాగా ఈ సినిమా పదవ రోజు రూ.4.20 కోట్ల షేర్ సాధించి టాలీవుడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతేకాకుండా పదవ రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నాన్-రాజమౌళి రికార్డు క్రియేట్ చేసింది. మొదటి మూడు స్థానాల్లో ఆర్ఆర్ఆర్, బాహుబలి-2, బాహుబలి సినిమాలున్నాయి.
ఇదే స్పీడ్ కొనసాగితే మరో వారంలో 20కోట్లు సాధించే చాన్స్ ఉంది. పైగా సంక్రాంతి వరకు ఈ సినిమాకు పోటీగా మరో సినిమా లేదు. ఇక ఈ రెండు వారాలను ధమాకా ఏ మేర క్యాష్ చేసుకుంటుందో చూడాలి. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. రవితేజకు జోడీగా శ్రీలీల నటించింది. ఈ సినిమా సక్సెస్‌లో సగం క్రెడీట్ శ్రీలీలకే దక్కుతుంది. తన నటన, డ్యాన్స్‌లతో ప్రేక్షకులను రిపీటెడ్‌గా థియేటర్లకు రప్పిస్తుంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి.
MassMaharaja @RaviTeja_offl 's
MASSive Day 1️⃣0️⃣ Rampage 💥#DhamakaBlockBuster in Cinemas Now 🥳🤩#DhamakaBook your tickets nowhttps://t.co/iZ40p9utmY@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/czAPi0Xk6F
— People Media Factory (@peoplemediafcy) January 2, 2023