GOAT Movie | తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ ఉన్న హీరో అంటే దళపతి విజయ్ (Thalapathy Vijay) అని చెప్పకతప్పదు. తలైవర్ తర్వాత మాస్ ఫాలోయింగ్‌తో పాటు ఆ రేంజ్లో ఆభిమానులు ఉన్నది అతడికే. అయితే విజయ్ సినిమా వస్తుందంటే చాలు ఆయన కోట్లాది మంది అభిమానులకు పెద్ద పండగే. ఇక తమిళనాడులో అయితే చెప్పక్కర్లేదు. విజయ్ పోస్టర్లతో థియేటర్లను మొత్తం నింపేస్తారు. తాజాగా ఆయన నటించిన గోట్ చిత్రం విడుదలై మొదటిరోజే రికార్డు కలెక్షన్స్‌ను రాబట్టింది.
దళపతి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT). ఈ సినిమాకు వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహించగా.. ప్రశాంత్, వైభవ్, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 05న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం విడుదలైంది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుండటంతో ఇదే విజయ్ లాస్ట్ మూవీ అని ప్రచారం జరగడంతో అభిమానులతో పాటు మూవీ లవర్స్ థియేటర్లకి పోటెత్తారు.
అయితే ఫస్ట్ షో నుంచే తమిళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ చిత్రం. ఇక మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు సాధించింది ఈ చిత్రం. కేవలం అడ్వాన్స్ రూపంలోనే హాఫ్ సెంచరీ మార్క్ టచ్ చేసిన ఈ చిత్రం తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా కలిపి రూ.126 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో రజనీ కాంత్ తర్వాత తొలిరోజు వంద కోట్లు కొల్లగొట్టిన హీరోగా విజయ్ మరోసారి రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు కబాలి, రోబో 2తో పాటు లియో సినిమాల మీదా ఉంది. ఈ సినిమా జోరు చూస్తుంటే ఫస్ట్ వీకెండ్లోపే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని లాభాల పట్టనున్నట్లు కనిపిస్తుంది.
G.O.A.T at the Box office 🔥🔥 @Ags_production pic.twitter.com/s6luZxQO6C
— Archana Kalpathi (@archanakalpathi) September 6, 2024