Thalapathy Vijay | తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ ప్రస్తుతం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT) సినిమా సక్సెస్‌లో ఉన్నాడు. వెంకట్ ప్రభు (Venkat Prabhu) దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 05న వరల్డ్ వైడ్‌గా విడుదలై మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా.. రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమానే విజయ్‌కు చివరి చిత్రం అని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. విజయ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తుండటంతో అభిమానులు కూడా దళపతికి ఇదే లాస్ట్ మూవీ అని గోట్ సినిమాకు తరలివెళుతున్నారు.
అయితే తాజాగా దళపతి 69 సినిమాకు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ 69వ సినిమాను ఈరోజు సాయంత్రం అనౌన్స్ చేయనున్నట్లు కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రోడక్షన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. అయితే ఈ మూవీ గురించి ఎటువంటి అప్డేట్ ఇస్తారు అనేది క్లారిటీ లేదు. మరోవైపు ఈ సినిమాకు హెచ్.వినోద్ దర్శకత్వం వహించనుండగా.. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ఈసారి విజయ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తుంది.
వచ్చే నెల మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుందని.. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నట్లు సమాచారం. విజయ్ చివరి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
5 mani-ku sandhippom nanba nanbi 🤝🏻
We are happy to announce that our first Tamil film is …………#KVN5update Today at 5 PM 🔥 pic.twitter.com/XU3UIO9TId— KVN Productions (@KvnProductions) September 13, 2024