గత ఏడాది ‘లియో’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు తమిళ అగ్రహీరో దళపతి విజయ్. ప్రస్తుతం ఆయన వెంకట్‌ప్రభు దర్శకత్వంలో తన 68వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘GOAT’ (GRETEST OF ALL TIME) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్లో రెండు క్యారెక్టర్స్ తాలూకు లుక్‌ను రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. యాక్షన్ ఎంటర్టైనర్గా టైమ్ ట్రావెల్ కథాంశంతో దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, జయరాం, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.