Tollywood | ఈ వారం సినిమాల పరిస్థితి ఏంటి.. వినాయక చవితి విన్నర్ ఎవరు..?

చాలా రోజుల తర్వాత టాలీవుడ్లో సినిమాల సందడి కనిపించింది. వినాయక చవితి సందర్భంగా ఒకేసారి అర డజను సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని ఓటీటీలో.. మరికొన్ని థియేటర్లో వచ్చాయి. అందులో మరీ ముఖ్యంగా అందరి చూపు నాని నటించిన టక్ జగదీష్ సినిమాపై ఉంది. దీన్ని డిజిటల్ మీడియాలో విడుదల చేయడంపై నాని అభిమానులు గగ్గోలు పెట్టారు. గత ఏడాది ఆయన నటించిన వి సినిమా కూడా అలాగే విడుదల చేయడంతో నిరాశపడ్డారు. దాదాపు 40 కోట్లు పెట్టి అమెజాన్ ప్రైమ్ వీడియో టక్ జగదీష్ సినిమా తీసుకుంది. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన రెండు గంటల తర్వాత సోషల్ మీడియాలో టక్ జగదీష్ పై ట్రోలింగ్ కూడా మొదలైంది. మరీ ముఖ్యంగా బలరామ కృష్ణులు, చినబాబు సినిమా ఛాయలు ఇందులో కనిపిస్తున్నాయి అంటూ విమర్శలొచ్చాయి.
జయలలిత బయోపిక్ తలైవి కూడా వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదలైంది. జాతీయ ఉత్తమ నటి కంగనా రనౌత్ నటించిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. అమ్మకు అద్భుతమైన నివాళి అందించారు అంటూ దర్శకుడు విజయ్ కి అభిమానులు ధన్యవాదాలు చెబుతున్నారు. మరోసారి జయలలితను గుర్తు చేసినందుకు వాళ్లు సంతోషపడుతున్నారు. సినిమాల్లో ఎక్కువగా వివాదాల జోలికి పోకుండా అమ్మ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కథ మొదలు పెట్టి.. మొదటి సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముగించాడు విజయ్. దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది.
ఇక గోపీచంద్ హీరోగా నటించిన సీటీమార్ సినిమా కూడా ఇదే రోజు విడుదలైంది. సంపత్ నంది తెరకెక్కించిన ఈ సినిమాకి ముందు నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సిటీమార్ మార్ థియేటర్లలో నిజంగానే విజిల్స్ వేయిస్తుంది. అయితే ఏపీలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈ సినిమాకు ఎలాంటి వసూళ్లు వస్తాయి అనేది ఇప్పుడే చెప్పలేరు ట్రేడ్ పండితులు. వీటితో పాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఇదే వారం విడుదలయ్యాయి. అయితే ప్రధానంగా గోపీచంద్, కంగనా రనౌత్, నాని మధ్య త్రిముఖపోటీ నడిచింది. ఇందులో నాని డిజిటల్ మీడియాలో సత్తా చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చెప్పలేం. గోపిచంద్ మాత్రం తన ఇమేజ్ తో మాస్ థియేటర్లలో సీటీ మార్ వేయిస్తున్నాడు. తలైవి సినిమాకు వీకెండ్ కలెక్షన్స్ బాగానే వచ్చేలా కనిపిస్తున్నాయి. మొత్తానికి వినాయక చవితి సినిమాలకు బాగానే కలిసొచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bigg boss: పండగ రోజు చల్లారని మంట..!
Roja: రోజా కూతురి బర్త్ డే .. వైరల్‌గా మారిన ఫొటోలు
Chiranjeevi: మెగాస్టార్ ఇంటి వినాయకుడిని చూశారా..!
Love Story: లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

