Thalaivan Thalaivii OTT | తమిళ నటుడు విజయ్ సేతుపతి(Vijay Sethupathi), నేషనల్ అవార్డు విన్నర్ నటి నిత్యా మీనన్ (Nithya Menon ) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తలైవన్ తలైవి’ (Thalaivan Thalaivii). తెలుగులో ఈ సినిమాను సార్‌మేడమ్ (SirMadam) పేరుతో డబ్ చేశారు మేకర్స్. ఈ చిత్రం తమిళంలో జూలై 25న విడుదల కాగా.. తెలుగులో ఆగష్టు 01న ప్రేక్షకుల ముందుకు వచ్చి కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.100 కోట్ల వసూళ్లను సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. మరోవైపు ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహించగా.. టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు.
Families’ favourite #ThalaivanThalaivii marks 100 CR worldwide gross with your endless love & support ❤️🫶@VijaySethuOffl @MenenNithya @pandiraaj_dir @iYogiBabu@Music_Santhosh @SathyaJyothi @Lyricist_Vivek @thinkmusicindia @studio9_suresh@Roshni_offl @kaaliactor @MynaNandhini… pic.twitter.com/VdDkK7opoL
— Sathya Jyothi Films (@SathyaJyothi) August 24, 2025