తెలుగులో వరుసగా భారీ చిత్రాలు నిర్మిస్తూ టాప్ ప్రొడక్షన్ హౌస్‌గా పేరు తెచ్చుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సక్సెస్ఫుల్ సినిమాలు తీస్తూ అభిరుచిగల నిర్మాతగా సత్తా చాటుతున్నారు సంస్థ అధినేత టీజీ విశ్వప్రసాద్. తాజాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కన్నడ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతున్నది. కేఆర్జీ స్టూడియోస్‌తో కలిసి అక్కడ సినిమాలను పంపీణి చేస్తామని, మంచి కంటెంట్‌కు ప్రాధాన్యతనిస్తామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.