Tere Ishk Mein | కోలీవుడ్ స్టార్ ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘తేరే ఇష్క్ మే’. ఈ చిత్రం నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. అయితే ఇదే సినిమాను తెలుగులో అమరకావ్యం పేరుతో విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా మూవీ నుంచి తెలుగు ట్రైలర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఆనంద్ ఎల్ రాయ్, ధనుష్ కాంబినేషన్లో ‘రాంఝణా’ (Raanjhanaa), ‘అత్రంగి రే’ (Atrangi Re) తర్వాత మూడో చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది.