టీఎఫ్‌డీఏ కోసం ముప్ఫైకోట్లతో పది సినిమాలు
ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్(TFDA) ఆధ్వర్యంలో ముప్ఫైకోట్ల వ్యయంతో పది సినిమాలు నిర్మించనున్నారు.
ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్(TFDA) ఆధ్వర్యంలో ముప్ఫైకోట్ల వ్యయంతో పది సినిమాలు నిర్మించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు TFDA హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించింది. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుతోపాటు అసోసియేషన్ సభ్యులైన వీఎన్ ఆదిత్య, సాయిరాజేష్, సముద్ర.వి, నవీన్ మేడారం, అజయ్‌కుమార్, టి.ప్రసన్నకుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ‘కళామతల్లికి చేసిన సేవ వల్లే సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంగా ఉన్నాను. ఏఎన్నార్, శోభన్‌బాబు వంటి మహానటులతో సినిమాలు నిర్మించాను. అప్పటి ఇండస్ట్రీ బావుండేది. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నిర్మాతలకు ఖర్చు పెరిగింది. థియేటర్లు తరిగిపోతున్నాయి. సత్తా ఉన్న నిర్మాతలు సినీనిర్మాణానికి దూరమయ్యారు. దాంతో ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి. అందుకే.. దర్శకులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను.
విలువలు, కమర్షియల్ అంశాలుండే కథల్ని నిర్మించాలనుకుంటున్నాను. క్రమశిక్షణతో కచ్ఛితంగా ఉదయం ఏడు గంటలకు తొలిషాట్ తీయాలి. క్వాలిటీ ఉన్న మంచి సినిమాలు రావాలి. తద్వారా ఆర్టిస్టులు, దర్శకులు ఇండస్ట్రీలో నిలబడాలి. అదేనాకు పదివేలు. అందుకే ఈ ప్రయత్నం’ అని చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యుల అభ్యున్నతికోసం తన సొంత సంస్థలో 30కోట్ల వ్యయంతో పది సినిమాలు నిర్మించేందుకు ముందుకొచ్చిన అగ్రనిర్మాత చదలవాడ శ్రీనివాసరావుకి శతసహస్త్ర కృతజ్ఞతాభివందనాలని, ఆయన చేస్తున్న ఈ సత్కార్యం వల్ల అసోసియేషన్‌లోని దర్శకులతోపాటు దాదాపు నూటయాభైమంది సహాయ దర్శకులకు అవకాశాలు లభిస్తాయని, ఈ సినిమాలకోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, స్క్రిప్ట్స్‌ని ఎంపిక చేసే బాధ్యత ఈ కమిటీదేనని దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

