Siddhu Jonnalagadda | యువ హీరో సిద్దు జొన్నల గడ్డ (Siddhu Jonnalagadda). ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం తెలుసు కదా(Telusu Kada). ఈ సినిమాకు పాపులర్ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సోదరి నీరజ కోన (Neeraja Kona) దర్శకత్వం వహిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ అప్డేట్ను పంచుకున్నారు. ఈ మూవీ టీజర్‌ను సెప్టెంబర్ 11న ఉదయం 11.11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సినిమాలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి, టాలీవుడ్ బ్యూటీ రాశి ఖన్నా కథానాయికలుగా నటించబోతున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి యువరాజ్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.
When life gives you two choices….
LOVE U 2 🫶❤️#TelusuKadaTeaser out on September 11th at 11.11 AM ✨#TelusuKada #LoveU2❤🔥
In cinemas worldwide from October 17th!STAR BOY #SiddhuJonnalagadda @NeerajaKona #RaashiiKhanna @SrinidhiShetty7 @MusicThaman @harshachemudu… pic.twitter.com/0E8IwWjBzQ
— People Media Factory (@peoplemediafcy) September 9, 2025