Actress| సినిమా వాళ్లకి రాజకీయాలతో టచ్ బాగానే ఉంటుంది. చాలా మంది సినిమా స్టార్స్ రాజకీయాలలోకి వచ్చి సక్సెస్ అయి మంచి పొజీషన్‌కి కూడా వెళ్లారు. హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా రాజకీయాలని శాసించడం మనం చూశాం. ఎంజీ రామ్‌చంద్రన్, కరుణానిధి, జయలలిత, అన్నాదురై.. వీరంతా సినీ పరిశ్రమకు చెందినవారే కాగా, వారు తమిళ రాజకీయాలని శాసించారు. అయితే మహిళలో కొందరు సీఎంగా పని చేశారు. వారిలో ముందుగా మనకు గుర్తుకు వచ్చేది జయలలిత. అయితే జయలలిత కన్నా ముందు సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ మహిళ తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసింది. ఆమె ఎవరో కాదు వి.ఎన్.జానకి
జానకి పూర్తి పేరు వైకోం నారాయణి జానకి కాగా, ఆమె కేరళలో 1924 సెప్టెంబరు 23న జన్మించారు. చిన్న వయస్సులో మ్యూజిక్ సహా వివిధ కళల్లో ట్రైనింగ్ తీసుకుంది. ఆమె బంధువు పాపనాశం శివన్ కర్నాటిక్ మ్యూజిషీయన్ కాగా,ఆయన దగ్గర క్లాసికల్ మ్యూజిక్, డ్యాన్స్ నేర్చుకొని సినిమాలలో వచ్చి పాపులర్ యాక్ట్రెస్ అయింది. జానకి ఎక్కువగా ఎంజి రామచంద్రన్‌కి జంటగా నటించింది. ఈ క్రమంతెనే ఎంజీ రామచంద్రన్ని వివాహం చేసుకుంది. రామచంద్రన్ 1987లో చనిపోయారు. దీంతో తమిళనాడు రాజకీయాల్లో తవ్ర సంక్షోభం తలెత్తడంతో ఎంజీఆర్ సతీమణి జానకి, రామచంద్రన్‌కు రాజకీయాల్లో అత్యంత సన్నిహితురాలైన జయలలితకు మధ్య పోటీ నెలకొంది.
ఈ అంతర్గత పోరు మధ్యలో 1988 జనవరి 7న తమిళనాడు సీఎంగా జానకి బాధ్యతలు స్వీకరించింది. అయితే, కేవలం 23 రోజులు మాత్రమే ఆమె ఆ బాధ్యతల్లో ఉండగా, ఆ తర్వాత జయలలిత ఆ బాధ్యతలు స్వీకరించింది. అయితే భారత రాజకీయాల్లో సీఎం అయిన తొలి సినీ నటిగా చరిత్రలో నిలిచింది జానకి. తీవ్ర రాజకీయ సంక్షోభంలోకి జారుకున్న తమిళనాడును ఆ సమస్య నుంచి ఆమె గట్టెక్కించింది. కాగా, జానకి తెలుగులో 1960లో వచ్చిన ‘సహస్ర సిర్చేద అపూర్వ చింతామణి’ సినిమాలో నటించింది. ఇక జయలలిత జీవిత నేపథ్యంలో ‘తలైవి’ సినిమా రాగా, ఇందులో లో జానకి పాత్రలో రోజా సినిమా హీరోయిన్ మధుబాల నటించింది.