హాలీవుడ్లో తెలుగమ్మాయి జోరు
చాలా కొద్దిమంది ఇండస్ట్రీకి వచ్చిన కొద్దిరోజుల్లోనే మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. ఈ మధ్య చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఎక్స్ట్రార్డినరీ ఫర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటున్నారు. మహేశ్‌బాబు హీరోగా చేసిన ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటించిన ఓ తెలుగమ్మాయి ఇప్పుడు హాలీవుడ్లో అదరగొడుతోంది. ఆ టీనేజ్ బ్యూటీ ఎవరో కాదు..
చాలా కొద్దిమంది ఇండస్ట్రీకి వచ్చిన కొద్దిరోజుల్లోనే మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. ఈ మధ్య చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఎక్స్ట్రార్డినరీ ఫర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటున్నారు. మహేశ్‌బాబు హీరోగా చేసిన ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటించిన ఓ తెలుగమ్మాయి ఇప్పుడు హాలీవుడ్లో అదరగొడుతోంది. ఆ టీనేజ్ బ్యూటీ ఎవరో కాదు.. అవంతిక వందనపు. ప్రస్తుతం ఈమె వయసు 18. తెలుగు నేపథ్యం ఉన్న అవంతిక ‘మీన్ గర్ల్స్ 2024’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించింది. ఆ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘మీన్ గర్ల్స్’లో కరేన్ శెట్టి పాత్ర పోషించిన అవంతిక నటనకు ప్రేక్షకుల ప్రశంసలు దక్కుతున్నాయి. విమర్శకులు సైతం పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు కుటుంబానికి చెందిన అవంతిక వందనపు 2005లో కాలిఫోర్నియాలో జన్మించింది. అక్కడే చదువుతూ యాక్టింగ్‌లోనూ ట్రైనింగ్ తీసుకుంది.
టాలీవుడ్లో 2016లో మహేశ్‌బాబు కథానాయకుడిగా చేసిన ‘బ్రహ్మోత్సవం’లో నటించింది. ‘మనమంతా’, ‘ప్రేమమ్’, ‘రారండోయ్ వేడుక చూద్దాం’, ‘బాలకృష్ణుడు’, ‘ఆక్సిజన్’, ‘ఆజ్ఞాతవాసి’ సినిమాల్లోనూ చేసింది. తర్వాత హాలీవుడ్‌కు వెళ్లిపోయింది. ‘మీరా-రాయల్ ఫ్యూచర్ ప్రెసిడెంట్’ అనే అమెరికన్ చిత్రంతో హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ‘డైరీ ఆఫ్ ఫ్యూచర్ ప్రెసిడెంట్’, ‘స్పిస్’, ‘సీనియర్ ఇయర్’ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడికి ‘మీన్ గర్ల్స్’తో మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ‘హోరోస్కోప్’ అనే హాలీవుడ్ హారర్ చిత్రంలో నటిస్తున్న ఈమె చేతిలో మరో సినిమా కూడా ఉంది. అవంతిక ప్రొఫెషనల్ కూచిపూడి డ్యాన్సర్ కూడా. పలు వేదికలపై డాన్స్ ఫర్ఫార్మెన్స్కు గాను అవార్డులు వచ్చాయి. ఈమె చిన్నప్పటి ఫొటోలు, ఇప్పటి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తమ్మీద ‘మీన్ గర్ల్స్’తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది అవంతిక.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
Mayor Reservations | ఏపీలో మేయర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఉత్తర్వులు
Jobs | నేవల్ డాక్‌యార్డ్, ఎయిర్‌క్రాఫ్ట్ యార్డ్‌లో 210 అప్రెంటిస్ ఖాళీలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

