Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతలు నేడు భేటి అయ్యారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన సమావేశం జరుగుతుంది. ఇక కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు తెలుగు సినీ నిర్మాతలు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సమవేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. అలాగే, సినిమా టిక్కెట్ల ధర పెంపు విషయంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ భేటిలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదరప్రసాద్, నిర్మాతలు అల్లు అరవింద్, సి అశ్వినీదత్, ఏ.ఎం. రత్నం, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , సుప్రియ, ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ తదితరులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారితో విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ప్రారంభమైన తెలుగు సినీ నిర్మాతల సమావేశం..#PawanKalyanAneNenu pic.twitter.com/TVoNGiofMG
— JanaSena Party (@JanaSenaParty) June 24, 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని, విజయవాడలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి అభినందించి, సినిమా ఇందస్త్రిపై చర్చించేందుకు సమావేశమైన తెలుగు సినీ నిర్మాతలు
* తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు,… pic.twitter.com/ZqHthVmlZ7
— JanaSena Party (@JanaSenaParty) June 24, 2024