Jailer | ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth). తలైవా నటిస్తోన్న మోస్ట్ అవెయిటెడ్ చిత్రాల్లో ఒకటి జైలర్ (Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన జైలర్ గ్లింప్స్ వీడియోతోపాటు కావాలా సాంగ్‌ను మ్యూజిక్ లవర్స్ ఫుల్‌ఎంజాయ్ చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
జైలర్ తెలుగు పంపిణీ హక్కుల విషయంలో డిస్ట్రిబ్యూటర్లు రూ.11 కోట్లు డిమాండ్ చేస్తుండగా.. తెలుగు డిస్ట్రిబ్యూటర్లు సిద్దంగా లేరన్న టాక్ ఇప్పుడు జోరుగా నడుస్తోంది. సాధారణంగా తలైవాకు తెలుగులో మంచి మార్కెట్ ఉంటుందని తెలిసిందే. రోబో, చంద్రముఖి, అరుణాచలం లాంటి బ్లాక్ బస్టర్లతో తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిసింది. అయితే ఆ తర్వాత వచ్చిన కాలా, పేట, దర్బార్, కబాలి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతోపాటు పంపిణీ హక్కులను దక్కించుకునే విషయంలో పునరాలోచించుకోవడం మొదలుపెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయని జోరుగా టాక్ నడుస్తోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో జైలర్ రైట్స్‌కు కేవలం రూ.5 కోట్ల నుంచి 6 కోట్ల వరకు మాత్రమే వెచ్చించేందుకు రెడీగా ఉన్నారని ఇన్సైడ్ టాక్. ఈ నేపథ్యంలో తమిళ నిర్మాతలు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ధరపై పునసమీక్షించుకోవాల్సిన టైం వచ్చేసిందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. లేదంటే ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడం మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు సవాలుతో కూడిన టాస్క్ అని చెప్పక తప్పదంటున్నారు సినీ జనాలు.
జైలర్ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన మోహన్ లాల్, సునీల్, తమన్నా (Tamannaah) పోస్టర్లు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. జైలర్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్నారు.
రజినీకాంత్ మరోవైపు జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో తలైవా 170 (Thalaivar 170)కూడా ప్రకటించాడు. ఈ చిత్రాన్ని వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. మరోవైపు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తలైవా 171 కూడా చేయనుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
రజినీకాంత్ జైలర్ గ్లింప్స్ వీడియో..
తమన్నా గ్లామరస్ లుక్..
.@tamannaahspeaks from the sets of #Jailer
@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/sKxGbQcfXL
— Sun Pictures (@sunpictures) January 19, 2023
జైలర్ సెట్స్ లో సునిల్
.@mee_sunil from the sets of #Jailer @rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/JJBfQw91QH
— Sun Pictures (@sunpictures) January 17, 2023
జైలర్ సెట్స్ లో మోహన్ లాల్..
Lalettan @mohanlal from the sets of #Jailer 🤩@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/wifqNLPyKf
— Sun Pictures (@sunpictures) January 8, 2023