Telugu Actor Vijaya Rangaraju | తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు విజయ రంగరాజు (Vijaya Rangaraju) మృతి చెందారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. (Vijaya Rangaraju). అకస్మాత్తుగా ఆయనకు గుండెపోటు రావడంతో రంగరాజు మరణించినట్లు సమాచారం. ఇక రంగరాజు మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.
విజయ రంగరాజు అసలు పేరు రాజ్ కుమార్. ఆయన చెన్నైలో రంగస్థల కళాకారునిగా అనేక నాటకాలలో నటించారు. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సీతా కళ్యాణం’ రంగరాజుకు నటుడిగా మొదటి సినిమా. అయితే అతడికి గుర్తింపు లభించింది మాత్రం బాలకృష్ణ హీరోగా వచ్చిన భైరవ ద్వీపం సినిమా ద్వారా. ఈ సినిమాలో అతడి నటనకు మంచి మర్కులు పడడమే కాకుండా సినిమాల్లో ఫుల్ బిజీగా మారిపోయాడు. నటుడిగా, ఫైట్ మాస్టర్‌గా, ఫైటర్‌గా, విలన్‌గా అన్ని భాషల్లో కలుపుకుని దాదాపు ఐదు వేలకు పైగా సినిమాల్లో ఆయన పనిచేశారు. గోపీచంద్ నటించిన ‘యజ్ఞం’ సినిమాలో ఆయన విలన్‌గా నటించడం అతడి కెరీర్లో టర్నింగ్ పాయింట్ అని పలు ఇంటర్వ్యూలలో ఆయన చెప్పుకోచ్చాడు.