Harihara Veramallu | పవన్ కల్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీర మల్లు (Harihara veeramallu) ప్రత్యేక షోలకు, టికెట్ల ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నెల 24న సినిమా విడుదల కావాల్సి ఉండగా, ఒక రోజు ముందుగానే అంటే బుధవారం (జూలై 23) పేయిడ్ ప్రీమియర్‌కు ఓకే చెప్పింది. అదేవిధంగా జూలై 24 నుంచి 27 వరకు ఐదు షోలు వేసుకునేందుకు కూడా అనుమతించింది.

బుధవారం రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో వేయనున్నారు. దీనికి టికెట్ ధరను రూ.600గా నిర్ణయించింది. అదనంగా జీఎస్టీ వసూలు చేయనున్నారు. ఆ తర్వాత నుంచి షోలకు మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేటుకు అదనంగా రూ.200, సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేట్లకు అదనంగా రూ.150 పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో మల్టీప్లెక్స్‌లలో రూ.531, సింగిల్ థియేటర్లలో రూ.354 ఉండనుంది. ఇక జూలై 28 నుంచి ఆగష్టు 2 వరకు సింగిల్ స్క్రీన్లలో టికెట్‌పై అదనంగా రూ.106, మల్టీప్లెక్సులలో టికెట్‌పై అదనంగా రూ.150 పెంచుకోవచ్చు.