Amardeep | బుల్లితెర, వెండితెర అని లేదు.ఈ మధ్య కాలంలో విడాకుల వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. మంచిగా ఉన్న జంటలని కూడా కొందరు విడదీస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. అయితే బుల్లితెరపై క్రేజీ జంటగా గుర్తింపు తెచ్చుకొని అందరి మన్ననలు పొందారు అమర్ దీప్, తేజస్విని. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరానికి చెందిన తేజస్విని తెలుగులోకి కోయిలమ్మ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ను పలకరించింది. కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళం టెలివిజన్ సీరియల్స్ లో నటించి మెప్పింది. తేజస్విని గౌడ నటుడు, బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రన్నరప్ అమర్ దీప్ ను మూడేళ్ల కిందట వివాహం చేసుకుంది.
2022 డిసెంబర్ 11న వీరి వివాహం ఘనంగా జరగగా, అప్పటి నుండి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. పలు షోలలో కూడా కనిపిస్తూ సందడి చేస్తున్నారు. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా అమర్ దీప్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. అయితే కొద్ది రోజులుగా అమర్ దీప్-తేజస్విని జంట విడిపోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం టీవీ షో ప్రోమో. ఇస్మార్ట్ జోడీ షోకి అమర్ దీప్, తేజస్వినిలను పిలిచిన ఓంకార్ .. ‘మీరిద్దరూ భార్యాభర్తలుగా 100 పర్సెంట్ హ్యాపీగా ఉన్నారా.. లేదంటే ఒక చైర్ వదిలేసి కూర్చోమని టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్‌లో ఓంకార్ ఒక చైర్ వదిలికూర్చోమంటే.. తేజస్విని రెండు చైర్లు వదిలేసి కూర్చుంది. ఇక ఆ సమయంలో అమర్, తేజస్వి చేసిన కామెంట్స్ కూడా ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయా అనేలా అనిపించాయి.
అయితే అప్పటి నుండి వీరిద్దరు విడిపోతారంటూ ప్రచారం జరగుతుండగా, తేజస్వి వీటికి చెక్ పెట్టింది. మేము విడిపోతున్నామని వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పుకొచ్చింది. భార్యభర్త అన్నాక గొడవలు సహజమన్నారు. అంతమాత్రానా ఎవరూ విడిపోరని.. అమర్ తనను ఎంతగానో ప్రేమిస్తున్నాడని.. తన కన్నా నేనే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని తెలిపింది. మేం ఇద్దరం హాయిగా సంతోషంగా ఉన్నామని ,ఇలాంటి రూమర్లను నమ్మొదని అభిమానులకు సూచించింది. ఇక త్వరలోనే పండంటి బిడ్డకు కూడా జన్మనివ్వబోతున్నట్టు కూడా గుడ్ న్యూస్ చెప్పింది. . అమర్‌కి అయితే అమ్మాయే కావాలట. నాకు ముందు నుంచి అమ్మాయే కావాలని ఉంది’ అని చెప్పింది తేజస్విని.