HanuMan Review | హను-మాన్ సినిమా రివ్యూచిన్న సినిమా పెద్దగా ఆకర్షించాలంటే ఒకటే మార్గం.. ప్రమోషనల్ కంటెంట్ లో కొత్తదనం వుండాలి. సినిమా చూడాలనే ఆసక్తిని కలిగించాలి. అలాంటి ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించింది ‘హను-మాన్'(HanuMan).. తెలుగులో సూపర్ హీరో జోనర్ సినిమాలు చాలా అరుదు. అలాంటి అరుదైన జోనర్ తో ఈ చిత్రాన్ని మలిచాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) . తేజ సజ్జా(Tejasajja) టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రం ప్రచార చిత్రాలు సినిమా చూడాలనే ఉత్సాహాన్ని కలిగించాయి. మరా ఉత్సాహంలో సినిమా కొనసాగిందా? సూపర్ మ్యాన్ గా తేజ సజ్జా ఎలాంటి వినోదాన్ని పంచారు? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే.
కథ గురించి :
అది అంజనాద్రి అనే ఊహ ప్రాంతం. ఆ వూర్లో హనుమంతు (తేజాసజ్జా) ఒక మామూలు కుర్రాడు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ సరదాగా కాలం గడిపేస్తుంటాడు. అనుకోని సంఘటనతో హనుమంతుకి కొన్ని అతీత శక్తులు వస్తాయి. ఆ శక్తుల గురించి తెలుసుకున్న మైఖెల్ (వినయ్‌రాయ్) అంజనాద్రి వస్తాడు. హనుమంతు వద్ద శక్తులని తన వశం చేసుకొని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడు కావాలనుకుంటాడు. మరా ఆ శక్తిని వశం చేసుకోవడానికి మైఖెల్ ఏం చేశాడు? మైఖేల్ వలన అంజనాద్రికి ఎలాంటి ముప్పు వాటిల్లింది ? హనుమంతు మైఖేల్ ని ఎలా అడ్డురుకున్నాడు ? అనేది తెరపై చూడాలి.
కథా విశ్లేషణ:
సూపర్ మ్యాన్ కథలన్నీ ఒక టెంప్లెట్ లో వుంటాయి. ఒక సామాన్యుడికి సూపర్ పవర్స్ వస్తే.. తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.. ఆ పవర్స్ శ్రతువులని ఎలా సంహరిస్తారనే కోణంలోనే సాగుతాయి. హనుమాన్ కూడా అలాంటి కథే. అయితే ప్రశాంత్ వర్మ మార్క్ టేకింగ్, అంజనాద్రి వర్క్ బిల్డింగ్, వినోదాన్ని పంచే సన్నివేశాలు, అచ్చతెలుగు పంధాలో సాగే సూపర్ మ్యాన్.. ఇవన్నీ హనుమాన్ ని ప్రత్యేకంగా నిలిపాయి. మైఖేల్ బాల్యంతో కథ మొదలౌతుంది. ఆ తరవాత కథ అంజనాద్రికి మారడం, హనుమంతు, అంజమ్మ, మీనాక్షి పాత్రల్ని పరిచయం, అక్కడ పాత్రల మధ్య వినోదం చాలా ఆహ్లాదకంగా ముందుకు సాగుతాయి.
పాలెగాళ్ల దుర్మాగాలని చూపిస్తూ.. సహజంగానే ఒక పాత్రకు సూపర్ పవర్స్ వస్తే వాటితో వారిని ఎలా ఎదురుకుంటాడనే ఆసక్తిని క్రియేట్ చేయడంలో విజయంసాధించాడు దర్శకుడు. ఎప్పుడైతే హనుమంతు చేతికి ‘రుధిర మణి’ దొరుకుతుందో అక్కడి కథ మరింత వినోదాత్మకంగా మారుతుంది. సూపర్ పవర్స్ తో హనుమంతు చేసే విన్యాసాలు ముఖ్యంగా పిల్లల్ని బాగా అలరిస్తాయి. విలన్, హీరో మధ్య పోరాటం కూడా రక్తికడుతుంది.
సూపర్ హీరో కథల్లో విజువల్స్ చాలా ముఖ్యం. ఈ విషయంలో హనుమాన్ కి మంచి మార్కులు పడతాయి. క్యాలిటీ విజువల్ ప్రజంటేషన్ ఆకట్టుకుంటుంది, ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ మరోస్థాయిలో వుంటుంది. ఈ చిత్రానికి ఇచ్చిన పార్ట్ 2 లీడ్ కూడా బావుంది.
నటీనటులు నటన: హనుమంతు పాత్రలో తేజ ఒదిగిపోయాడు. తన నటన, డైలాగ్ చెప్పే విధానం చాలా సహజంగా అనిపించాయి. యాక్షన్ సీన్స్ లో కూడా ఆకట్టుకున్నాడు. ఈ పాత్ర తేజ్ కెరీర్ కు మంచి బూస్ట్ ఇస్తుంది. వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర మెప్పిస్తుంది. మీనాక్షిగా చేసిన అమృత పాత్ర మాత్రం అంత బలంగా వుండదు. వినయ్ రాయ్ విలనిజం బావుంది. సత్య, గెటప్ శ్రీను, రాకేశ్ మాస్టర్ పాత్రలు వినోదాన్ని పంచుతాయి. అన్నట్టు ఇందులో కోటి అనే వానరం పాత్రకు రవితేజ చెప్పిన వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
టెక్నికల్: సాంకేతికంగా సినిమా ఉన్నతంగా వుంది. నేపధ్య సంగీతానికి మంచి మార్కులు పడతాయి. యాక్షన్ సీక్వెన్స్ లని మరో స్థాయి తీసుకువెళ్ళింది. కెమరాపనితనం బ్రిలియంట్ గా వుంది. ప్రొడక్షన్ డిజైన్ లో క్యాలిటీ వుంది. సీజీ వర్క్ అద్భుతంగా కుదిరింది. విజువల్ ఎఫ్ఫెక్ట్స్ బావున్నాయి. నిర్మాణల్లో మంచి నాణ్యత కనిపించింది.
ప్లస్ పాయింట్స్ :
కథ, కథనం
, తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ విజన్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
: కుదరని ప్రేమకథ
, అక్కడక్కడ సాగదీత
*రేటింగ్ 3.25/5
హనుమాన్ ట్రైలర్..
When DARKNESS eclipses DHARMA, The ANCIENTS shall RISE again 🔥
Embark on a surreal odyssey,#HanuManTrailer Out Now ❤️🔥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123 #HanuMan In cinemas from JAN 12, 2024 💥@Niran_Reddy @Actor_Amritha @varusarath5… pic.twitter.com/7rNODREH2r— BA Raju’s Team (@baraju_SuperHit) December 19, 2023
Avakaya Anjaneya సాంగ్ లుక్..
Massy beats repu #AvakayaAnjaneya
3rd Single from #HANUMAN Releasing Tomorrow, 28th NOV @ 4:05 Pm🎶
A @PrasanthVarma Film @anudeepdev 🥁#HANUMAN from JAN 12th,2024💥@Niran_Reddy @Primeshowtweets @RKDStudios pic.twitter.com/YRSN61UVXb
— Teja Sajja (@tejasajja123) November 27, 2023
Sound mixing for #HanuMan has begun! 🙏🏽
Experience the immersive audio journey we are creating in #DolbyAtmos ! 😊@Primeshowtweets pic.twitter.com/fGCyU8O2NS
— Prasanth Varma (@PrasanthVarma) November 23, 2023
హనుమాన్ అండర్ వాటర్ షాట్స్..
After a phenomenal response to the epic teaser
Team #HanuMan shot a breath-taking underwater sequence on a grand scale that will leave the audience spellbound 💥
A @PrasanthVarma Film
🌟ing @tejasajja123 @Actor_Amritha @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets pic.twitter.com/ry4K18UGg3— Vamsi Kaka (@vamsikaka) December 20, 2022
హనుమాన్ టీజర్.. వీడియో