Hanu-Man Movie Special Poster | ప్రయోగాత్మక సినిమాలకు తెరకెక్కించడంలో ప్రశాంత్ వర్మ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ‘అ!’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ వర్మ ‘కల్కి’, ‘జాంబిరెడ్డి’ వంటి వినూత్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం ఈయన యంగ్ హీరో తేజసజ్జాతో ‘హను మాన్’ అనే సూపర్ హీరో చిత్రాన్ని చేస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, ఇంట్రడక్షన్ గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలను క్రియేట్చేశాయి. తాజాగా మేకర్స్ తేజసజ్జా బర్త్డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు.
లేటెస్ట్గా విడుదలైన స్పెషల్ పోస్టర్లో తేజసజ్జా ఎడ్ల బండిలో కూర్చోని చిరునవ్వులు చిందిస్తున్నాడు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్విట్టర్లో హ్యపి బర్త్డే మై సూపర్ హీరో. గిఫ్ట్ దసరాకి ఇస్తా అంటూ ట్వీట్ చేశాడు. దీంతో సినిమా దసరాకు విడుదల కాబోతుందా అంటూ నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో తేజకు జోడీగా అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలో నటిస్తుంది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో వినయ్ రాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.
Happy birthday my Super Hero @tejasajja123 🤗
Gift #Dussehra ki yisthaa! 😉#HanuMan #HappyBirthdayTejaSajja 🥳#SuperHeroHanuMan🔶@Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Niran_Reddy @Chaitanyaniran @Primeshowtweets @tipsofficial pic.twitter.com/qMBLw6TdCH
— Prasanth Varma (@PrasanthVarma) August 23, 2022