మిరాయి మెరుపులు
‘హను-మాన్'ఫేం తేజ సజ్జా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్'. ఇందులో తేజ సజ్జా సూపర్ యోధాగా కనిపించనున్నారు.
‘హను-మాన్’ఫేం తేజ సజ్జా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘మిరాయ్’. ఇందులో తేజ సజ్జా సూపర్ యోధాగా కనిపించనున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2డి, 3డి ఫార్మాట్లలో, ఎనిమిది భాషల్లో సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
శనివారం హీరో తేజ సజ్జా పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ ఓ కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో సూపర్ యోధగా తేజ సజ్జా కనిపిస్తున్నారు. ఆయన పాత్రలో ఉండే పట్టుదల, ధైర్యం, ‘మిరాయి’ కథలో ఉండే హై వోల్టేజ్ డ్రామాను ఈ లుక్ ప్రజెంట్ చేస్తున్నది.
ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తున్నదని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా హిందీ వెర్షన్‌ను బాలీవుడ్ టాప్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయిక.
శ్రియ శరణ్, జయరామ్, జగపతిబాబు ఇతరపాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: మణిబాబు కరణం, సంగీతం: గౌరహరి. ఇదిలావుంటే.. ‘మిరాయ్’ చిత్రాన్ని నిర్మిస్తున్న పీపుల్ మీడియా సంస్థలోనే తేజ సజ్జా మరో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా కూడా ‘మిరాయ్’ తరహాలో భారీగానే ఉంటుందని శనివారం నిర్మాతలు ప్రకటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Parole | దీపావళి సందర్భంగా.. 143 మంది ఖైదీలకు పెరోల్
KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్
Gautam Prasad Yallapu | గౌతమ్ ప్రసాద్ యల్లపు దర్శకత్వంలో ‘ప్రొడక్షన్ నంబర్ 1’ చిత్రం.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం!
Psoriasis | సోరియాసిస్ అంటే ఏమిటి.. ఎలా వస్తుంది.. లక్షణాలు ఎలా ఉంటాయి..?
పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండానే పిరికిపందలా పారిపోయారు.. అచ్చెన్నాయుడు ఎద్దేవా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

