Mirai | ఈ మధ్య కాలంలో వందల కోట్ల బడ్జెట్‌తో చేస్తున్న సినిమాలు సైతం గ్రాఫిక్స్ విషయంలో ప్రేక్షకులను మెప్పించలేక ట్రోలింగ్ బారిన పడుతున్నాయి. కానీ యంగ్ హీరో తేజ సజ్జా మాత్రం పరిమిత బడ్జెట్లో వావ్ ఫ్యాక్టర్ అనేలా విజువల్ బేస్డ్ మూవీస్‌తో సూపర్ హీరోగా దూసుకుపోతున్నాడు. హనుమాన్ తర్వాత ఏది పడితే అది చేయకుండా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్న తేజ సజ్జా.. ఈసారి యూనివర్సల్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో అదరగొట్టిన ఈ కుర్ర హీరో.. ఇప్పుడు మిరాయ్ అంటూ అద్భుతం చేయడానికి వస్తున్నాడు. సినిమాటోగ్రఫర్ కమ్ దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఇక ఈ ట్రైలర్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. ఈ సినిమా ఒక విజువల్ వండర్ అని.. జస్ట్ మూడు నిమిషాల ట్రైలర్‌తో అంచనాలను పెంచేశారు మేకర్స్. ఈ మధ్య కాలంలో వచ్చిన విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమాల్లో.. ది బెస్ట్ అవుట్ పుట్ ఇదే అనేలా మిరాయ్ ట్రైలర్ ఓ రేంజ్లో ఉంది. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు.. ప్రతి ఫ్రేమ్ గూస్బంప్స్ ఇచ్చేలా ఉంది. ఈ మధ్య కాలంలో ఇంత యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన ట్రైలర్ మరోటి రాలేదనే చెప్పాలి. ప్రామిసింగ్‌గా సాగిన ఈ ట్రైలర్.. తేజ సజ్జాకు మరో పాన్ ఇండియా హిట్ ఇచ్చేలా ఉంది. ముఖ్యమైన ఓ తొమ్మిది శక్తివంతమైన గ్రంథాలు.. వాటి కోసం వెతికే విలన్.. దాన్ని అడ్డుకునేందుకు హీరో చేసే పోరాటంతో విజువల్ గ్రాండియర్‌గా ట్రైలర్ సాగింది. హీరో చేసిన యాక్షన్ స్టంట్స్, అడ్వెంచర్ ఎలిమెంట్స్ అదిరిపోయాయనే చెప్పాలి. యోధుడిగా కనిపించబోతున్న తేజ.. మరోసారి సూపర్ హీరోగా ట్రైలర్‌తో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా.. ట్రైలర్ చివర్లో వచ్చే శ్రీరాముడు షాట్ మాత్రం పీక్స్ అనే చెప్పాలి. ఇలాంటి అద్భుతమైన ట్రైలర్ ఇచ్చి, విజువల్ వండర్ సినిమా ఇవ్వబోతున్న నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా మీడియా ఫ్యాక్టరీ పై విఎఫ్ఎక్స్ విషయంలో సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సినిమాలో డైనమిక్ హీరో మంచు మనోజ్, సీనియర్ హీరోయిన్ శ్రియ కీలక పాత్రలో నటిస్తున్నారు. మొత్తంగా.. ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ పై పాన్ ఇండియా లెవల్లో ఒక్కసారిగా అంచనాలు పెరగడంతో పాటు.. భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో బడా బడా బ్యానర్లు రిలీజ్ చేస్తున్నాయి. దీంతో.. సెప్టెంబర్ 12న మిరాయ్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది.