టాలెంటెడ్ డైరెక్టర్ తేజ చాలా మంది కొత్త వారిని ఇండస్ట్రీకి పరిచయం చేశాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తేజ ఇంట్రడ్యూస్ చేసిన నటీనటులు చాలా వరకు సక్సెస్ ఫుల్‌గా సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. తేజ ప్రస్తుతం కొత్త అమ్మాయి గీతిక తివారి (Geethika Tiwari)ని అహింస సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. తేజ డైరెక్షన్లో అభిరామ్ దగ్గుబాటి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.
అయితే హీరోయిన్ గీతికకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. తొలి సినిమా విడుదల కాకముందే ఈ భామకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తున్నాయట. టాలీవుడ్ సర్కిల్ టాక్ ప్రకారం గీతిక చేతిలో ప్రస్తుతం వరుస తెలుగు సినిమాలున్నట్టు జోరుగా టాక్ నడుస్తోంది. ఈ భామను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన సినిమాలో తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడని ఓ వార్త ఇండస్ట్రీ సర్కిల్లో టాక్ ఫ్ ది టౌన్‌గా మారింది.
మహేశ్ బాబుతో చేస్తున్న ఎస్ఎస్ఎంబీ 28లో గీతిక గీతిక తివారిని చిన్న పాత్రలో త్రివిక్రమ్ చూపించబోతున్నాడని లేటెస్ట్ టాక్. అంతేకాదు కొత్తవారితో మరో రెండు సినిమాలు చేసేందుకు గీతిక తివారి రెడీ అవుతున్నట్టు మరో అప్డేట్ కూడా హల్ చల్ చేస్తోంది. మోడల్ నుంచి నటిగా మారిన గీతిక తివారి తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నాగార్జున, ప్రభు గణేశన్, శివరాజ్‌కుమార్ లాంటి స్టార్లతో కలిసి కల్యాణ్ జ్యువెల్లర్స్ యాడ్‌లో మెరిసింది.
అహింస టీజర్..
Read Also: Samantha | ఫైట్స్ అంటే చాలా ఇష్టం.. యశోదను ఎందుకు చూడాలో చెప్పిన సమంత
Read Also: Prakash Raj | కొత్త ప్రకాశ్‌రాజ్‌ను చూస్తారు.. రంగమార్తాండ సినిమాపై విలక్షణ నటుడు
Read Also: Sreenu Vaitla | డైరెక్టర్ శ్రీను వైట్ల ఫాం కేర్ టేకర్‌ను కాటేసిన పాము
Read Also: Karthi25 | వినూత్న టైటిల్‌తో కార్తి కొత్త సినిమా..!