టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’ (Tees Maar Khan Trailer). కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్ ఖాన్ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఎందుకొట్టావ్ రా వాళ్లని అని ఓ వ్యక్తి ఆది (చైల్డ్ ఆర్టిస్టు)ని అడిగితే..‘మా అమ్మను తప్పుగా చూశారు..మా అమ్మ జోలికొస్తే ఏ అమ్మ కొడుకునైనా కొడతానంటూ’ చెబుతున్న డైలాగ్స్ తో షురూ అయిందిట్రైలర్. ఆది పాత్ర పోలీసాఫీసర్‌గా ఫన్, సీరియస్ యాంగిల్లో ఎంటర్ టైనింగ్ టచ్ ఇస్తూ సాగనున్నట్టు ట్రైలర్‌తో చెప్పేశాడు దర్శకుడు. పాయల్, ఆది మధ్య లవ్ ట్రాక్ కూడా మూవీ లవర్స్ ఎంజాయ్ చేసేలా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన తీస్ మార్ ఖాన్ పోస్టర్, టీజర్ కు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని విజయ్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో పూర్ణ, సునీల్, కబీర్ దుహాన్ సింగ్ కీలకపాత్రల్లో నటించారు. సాయికార్తీక్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 19న విడుదల కానుంది.
https://t.co/HNlwQqkfbb TMK TRAILER #TeesMaarKhan pic.twitter.com/MSJsHZwXoJ
— Aadi Saikumar (@iamaadisaikumar) August 8, 2022