నాగశౌర్య నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్యాడ్‌బాయ్ కార్తీక్’ టీజర్ సోమవారం విడుదలైంది. రామ్ దేశినా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చింతలపూడి శ్రీనివాస రావు నిర్మిస్తున్నారు. ‘నువ్వు బ్యాడ్‌బాయ్ అని చెప్పారు..కానీ స్మార్ట్బాయ్లా ఉన్నావ్..’ అనే డైలాగ్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం యాక్షన్, యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో సాగింది. నాగశౌర్య ైస్టెలిష్లుక్స్తో కనిపించారు. ‘ఇప్పుడు అసలైన మ్యాచ్ మొదలైంది’ అంటూ నాగశౌర్య చెప్పిన డైలాగ్‌తో ఇదొక ప్రతీకార నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్థమవుతున్నది.
ఇప్పటి వరకు విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తున్నదని, యాక్షన్‌తో పాటు చక్కటి కామెడీ ఎలిమెంట్స్ ఉండే చిత్రమిదని మేకర్స్ పేర్కొన్నారు. విధి, సముద్రఖని, నరేష్ వీకే, సాయికుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హారిస్ జైరాజ్, రచన-దర్శకత్వం: రామ్ దేశిన (రమేష్).