ప్రముఖ క్రికెటర్ ఎం.ఎస్.ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ రూపొందించిన చిత్రం ‘ఎల్‌జీఎమ్’ (లెట్స్ గెట్ మ్యారీడ్). హరీష్ కల్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు ప్రధాన పాత్రల్ని పోషించారు. ధోని ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాక్షి ధోని నిర్మించారు. ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సాక్షి ధోని మాట్లాడుతూ ‘ తెలుగు రాష్ర్టాల్లో ధోనికి భారీ సంఖ్యలో అభిమానులు న్నారు. అందుకే ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నాం. జీవితంలోని అనుబంధాల గురించి చర్చించే చిత్రమిది. ఓ ఇండిపెండెంట్ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె మనసులోని భావాలు ఎలా ఉన్నాయి? ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటన్నదే చిత్ర కథాంశం’ అన్నారు. ఈ కార్యక్రమంలో సుధీర్‌బాబు, నదియా తదితరులు పాల్గొన్నారు.