NTR Fans | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీకి చెందిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నోరు పారేసుకున్నారు. ఎన్టీఆర్‌ను దూషిస్తూ ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడిన ఒక ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఈ సంఘటనపై అటు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, ఇటు టీడీపీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు మాటాల యుద్థానికి దిగారు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ -2 విడుదల సందర్భంగా అభిమానుల స్పెషల్ షోకు ఆహ్వానించేందుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడు, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను కలిసినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. జూనియర్ ఎన్టీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ఆ ఆడియో క్లిప్‌లో వైరల్ అవుతుంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారంటూ ఆయన అసభ్య పదజాలం వాడాడు. నారా లోకేష్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనీయమంటూ, ‘వార్ 2’ షోలను అనంతపురంలో నిలిపివేయాలని హెచ్చరించినట్లుగా కూడా ఆ ఆడియోలో ఉంది.
ఈ ఆడియో క్లిప్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ, ఇది సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీడీపీ నాయకులు కానీ, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కానీ అధికారికంగా స్పందించలేదు. ఈ సంఘటన రాజకీయ మరియు సినిమా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
జూనియర్ ఎన్టీఆర్‌ను లం* కొడుకు అంటూ బూతులు తిట్టిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
జూనియర్ ఎన్టీఆర్ సినిమా వార్ 2 సినిమా షోలను అనంతపురంలో ఆపేయాలంటూ వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ pic.twitter.com/D5Y6xstJ7j
— Telugu Scribe (@TeluguScribe) August 17, 2025