Peddi | ‘పెద్ది’ మూవీ ‘చికిరి చికిరి’ పాటకు టీడీపీ నేత డ్యాన్స్… ఫిదా అయిన పెద్ది డైరెక్టర్మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి విడుదలైన ‘చికిరి చికిరి’ పాట సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. యువతతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ పాటకు ఫిదా అవుతున్నారు. తాజాగా కడప జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు పంతగాని నరసింహ ప్రసాద్ ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. కుటుంబ వేడుకలో చేసిన ఈ డ్యాన్స్ ఇప్పుడు ఇంటర్నెట్ను ఓ ఊపు ఊపేస్తోంది.రైల్వే కోడూరుకు చెందిన నరసింహ ప్రసాద్, ఇటీవల ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో పాల్గొని భార్య, సోదరుడు, ఇతర బంధువులతో కలిసి ‘చికిరి చికిరి’ పాటకు జోష్‌గా నర్తించారు. ఈ సరదా డ్యాన్స్ వీడియోను ఆయనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
“చాలా రోజుల తర్వాత కుటుంబంతో గడపడం సంతోషంగా ఉంది. సరదాగా వేసిన స్టెప్పులు మాత్రమే… రామ్ చరణ్ ఫ్యాన్స్ కోప్పడకండి” అని క్యాప్షన్ జోడించడం హైలైట్‌గా మారింది. ఈ వీడియో కాస్తా వైరల్ అవ్వడంతో ‘పెద్ది’ దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా అది గమనించారు. ఆయన వీడియోను రీట్వీట్ చేస్తూ ప్రశంసలు కురిపించడంతో రామ్‌చరణ్ అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు.ప్రస్తుతం టీడీపీ సాంస్కృతిక విభాగ అధ్యక్షుడిగా ఉన్న పంతగాని నరసింహ ప్రసాద్ నటుడు కూడా. దివంగత మాజీ ఎంపీ, నటుడు శివప్రసాద్‌కు అల్లుడు కావడం విశేషం.ఇక ‘పెద్ది’ పాన్ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. రామ్‌చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది.
ఇటీవల విడుదలైన ‘చికిరి చికిరి’ పాట యూట్యూబ్‌లో 75 మిలియన్ల వ్యూస్ దాటడం విశేషం. అభిమానులు, సెలబ్రిటీలు చేస్తున్న రీల్లు, డ్యాన్స్ వీడియోలతో ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ముందుకు దూసుకుపోతోంది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ కొట్టడం ఖాయం అని జోస్యాలు చెబుతున్నారు. రామ్ చరణ్ గత చిత్రం గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచడంతో ఇప్పడు పెద్దిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
🤩🤍🙏🏻🧿 https://t.co/MJlAKa7uMC
— BuchiBabuSana (@BuchiBabuSana) November 21, 2025