Thammudu | హిట్టు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు టాలీవుడ్ హీరో నితిన్(Nithiin). ఇప్పటికే భీష్మ లాంటి హిట్టు అందించిన దర్శకుడు వెంకీ కుడుములతో రాబిన్ హూడ్ సినిమా చేస్తున్న నితిన్ వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్‌తో కలిసి ‘తమ్ముడు’ (Thammudu) సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు-శిరీష్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ సగానికి పైగా కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం తాజాగా విడుదల తేదీని ప్రకటించింది.
ఈ సినిమాను మహా శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఈ పోస్టర్లో ఊరి ప్రజలంతా తరుముతూ ఉంటే నితిన్ ఒక పాపని భుజాన ఎత్తుకుని పరిగెత్తడం చూడవచ్చు. ఈ సినిమాలో కాంతార ఫేం సప్తమి గౌడ హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాతోనే తెలుగు సీనియర్ నటి లయ (Laya) రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. లయ చివరిగా టాటా బిర్లా మధ్యలో లైలా(Tata Birla Madhyalo Laila) అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యింది. ఇక చాలా రోజుల తర్వాత నితిన్ సినిమాతో మళ్లీ తెలుగులో అడుగుపెట్టబోతుంది. ఈ చిత్రంలో నితిన్‌కు అక్కగా లయ(Laya) నటించనున్నట్లు సమాచారం. కాంతార, విరూపాక్ష చిత్రాల సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.
This Maha Shivaratri 🔱
Gear Up for #Thammudu‘s Courageous and Powerful Saga🔥🔥🔥#ThammuduForShivaratri #SriramVenu #DilRaju @SVC_official @AJANEESHB pic.twitter.com/SaR6R3Xux7
— nithiin (@actor_nithiin) November 4, 2024