పవన్ కళ్యాణ్ విషయంలో పోసాని కృష్ణమురళిని తప్పు బట్టిన తమ్మారెడ్డి

ఇండస్ట్రీలో, అలాగే రాజకీయవర్గాల్లో ఇప్పుడు పోసాని కృష్ణమురళి గురించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడిన భాష అందరికీ అభ్యంతరకరంగా మారింది. ముఖ్యంగా ఒక పార్టీ అధినేతను పట్టుకుని అంత దారుణంగా విమర్శించడం ఎవరూ పెద్దగా హర్షించడం లేదు. ఒకవేళ నిజంగా ఆయన అభిమానులు నిన్ను బాధ పెట్టినా కూడా మీడియా ముందు అంత దారుణంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా.. అంటూ టాలీవుడ్ ప్రముఖులు కొందరు పోసాని కృష్ణమురళి తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. తాజాగా సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా పోసానిని తప్పుపట్టాడు. ఆయన ఉపయోగించిన భాషను ఖండించాడు.

పవన్ కళ్యాణ్‌ను విమర్శించే అన్ని హక్కులు పోసాని దగ్గర ఉన్నాయి.. కానీ అతడి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు మాత్రం పోసాని కృష్ణ మురళికి లేదు. ఆరోజు జరిగిన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ ఎవరినీ వ్యక్తిగతంగా ఉద్దేశించి మాట్లాడలేదు. అలాంటప్పుడు ఆయన వ్యక్తిగత జీవితంపై ఎందుకు నోరు జారాడు.. ఆ అవసరం ఏమొచ్చింది అంటూ ప్రశ్నించాడు తమ్మారెడ్డి భరద్వాజ. రాజకీయ సిద్ధాంతాలపై మాట్లాడి ఉంటే బాగుండేది. కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై అలా నోరు జారడం కరెక్ట్ కాదు. దాన్ని ఎవరు హర్షించరు అంటున్నాడు తమ్మారెడ్డి.
గతంలో కూడా కత్తి మహేశ్.. పవన్ కళ్యాణ్‌పై నోరు జారిన విషయం ఆయన గుర్తు చేశారు. పోసాని అంత దారుణంగా బూతులు తిట్టిన తర్వాత ఇప్పుడు పవన్ అభిమానులు తనను తిడుతున్నారు అని మీడియా ముందుకు రావడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నాడు. కొన్నిసార్లు అభిమానులు కూడా హీరోల మాట వినరు.. ఎంత చెప్పినా ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేరు. వాళ్లను నియంత్రించటం కష్టమని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపాడు. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కాస్త హద్దుల్లో ఉండాలని కోరాడు ఈయన. ట్రోల్స్ చేస్తే ఈ విషయాన్ని అనవసరంగా పెద్దది చేసినట్లు ఉంటుంది అంటున్నాడు. కేవలం తమ్మారెడ్డి మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో ఇంకా చాలామంది పోసాని వాడిన భాషను ఖండిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
సమంత వదిన.. మీరు మా అన్నయ్యతోనే ఉండాలి.. చైసామ్ విడాకులపై శ్రీరెడ్డి స్పందన
Posani: పోసాని ఇంటిపై రాళ్ల దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
నిన్ను అందుకే కొన్నాళ్లు పక్కన పెట్టాను.. ఆలీతో మోహన్ బాబు
Singam: డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు దొరికిన సింగం నటుడు
ఉత్తేజ్ భార్య సంతాప సభలో ఏడ్చేసిన మెగాస్టార్ చిరంజీవి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

