Producer S.S. Chakravarthy Passes Away | తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎస్.ఎస్ చక్రవర్తి మృతి చెందాడు. గత కొంత కాలంగా కాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చక్రవర్తి శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచాడు. ఆయన మరణం పట్ల పలువురు కోలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇక చక్రవర్తికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఆయన కొడుకు జానీ రేణిగుంట అనే తెలుగు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఇక చక్రవర్తి తన సినిమా కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలను నిర్మించాడు. 1997లో ‘రాశి’ అనే మూవీతో సినీ ప్రయాణం మొదలు పెట్టిన చక్రవర్తి ‘వాలి’, ‘రెడ్’, ‘సిటిజెన్’, ‘మగవారే’, ‘ఆంజనేయ’ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. కాగా చక్రవర్తి ఎక్కువగా అజిత్తోనే సినిమాలు తెరకెక్కించాడు.