ర్యాన్ గాస్లింగ్, క్రిస్ ఇవాన్స్, తమిళ హీరో ధనుష్, ఆర్మాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘గ్రే మ్యాన్’. ఈ చిత్రానికి జో రూసో, ఆంటోనీ రూసో దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ సినిమా విడుదలై మంచి ఆదరణ పొందుతున్నది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించారు.
ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ గ్రే మ్యాన్ సీక్వెల్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నది. ‘ఈ సినిమాతో ప్రేక్షకులకు మంచి థ్రిల్లర్ అనుభూతిని పంచాం. ఈ తరహాలో మరిన్ని సినిమాలు నిర్మిస్తూ ఫ్రాంఛైజీని కొనసాగించబోతున్నాం’అని నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ హెడ్ స్కాట్ తెలిపారు.