Vishal | నటుడు విశాల్, తమిళ నిర్మాతల మండలి మధ్య వివాదం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. హీరో విశాల్‌తో సినిమాలు తీయాలనుకునే దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లకు నిర్మాతల మండలి షాకిచ్చింది. ఎవరైనా సరే విశాల్‌తో సినిమా తీయాలంటే తమ వద్ద పర్మిషన్ తీసుకోవాల్సిందేనని కండీషన్ పెట్టింది.
హీరో విశాల్ 2017-19 మధ్య తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ సమయంలో రూ.12 కోట్లు దుర్వినియోగం చేశాడని ప్రస్తుత నిర్మాత మండలి సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలోనే విశాల్‌తో ఎవరూ పనిచేయవద్దని ఓ లేఖను సైతం విడుదల చేశారు. కాగా, నిర్మాతల మండలి లేఖపై హీరో విశాల్ స్పందించారు.
తాను సినిమాలు చేయకుండా ఎవరూ ఆపలేరని విశాల్ తెలిపారు. తాను మూవీస్ చేస్తూనే ఉంటానని కౌంటర్ ఇచ్చారు. నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి మంచే చేశానని, నిధులను వారి సంక్షేమం కోసమే వినియోగించానని స్పష్టం చేశారు. ఇప్పుడు నిర్మాతల మండలిలో ఉన్నవారు గతంలో తన కింద సభ్యులుగా ఉన్న వారేనని.. వారికి అన్ని నిజాలు తెలుసని చెప్పారు. తమిళ సినిమా పరిశ్రమలో అనేక సమస్యలు ఉన్నాయని, ముందుగా వాటిపై పోరాడితే బాగుంటుందని సూచించారు.