Director Bala and muthumalar divorce | కొన్నాళ్లుగా ఇండస్ట్రీ విడాకుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఆమీర్‌ఖాన్-కిరణ్‌రావు, సమంత- నాగచైతన్య, ధనుష్-ఐశ్వర్య సహా పలువురు విడాకులు తీసుకోగా.. తాజాగా మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకుంది. తన భార్య నుంచి విడాకులు తీసుకున్నట్లుగా సంచలన దర్శకుడు బాలా ప్రకటించాడు.
Director Bala and muthumalar get divorce
శివపుత్రుడు, నేనే దేవుణ్ని, వాడు వీడు వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ స్టార్ డైరెక్టర్ బాలా. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విక్రమ్‌ను చియాన్ విక్రమ్‌గా మార్చింది కూడా ఈయనే. సంచలన సినిమాలతో పేరు తెచ్చుకున్న బాలా.. ఇప్పుడు తన భార్య నుంచి విడిపోయాడు. తన భార్య ముత్తు మలర్తో విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించాడు. ఏడాది కాలంగా వరుసగా స్టార్ కపుల్స్ విడిపోతున్నారు. సమంత-నాగ చైతన్య, ధనుష్ – ఐశ్వర్య రజినీకాంత్ విడాకుల విషయం ఇంకా కళ్ల ముందు ఉండగానే.. ఇప్పుడు బాలా కూడా విడాకులు తీసుకున్నాడు. ఈ మధ్యే ఆయనకు ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు అయ్యాయి. 17 ఏళ్ల క్రితం ముత్తు మలర్తో బాలా వివాహం జరిగింది. ఈ జంటకు ఒక పాప కూడా ఉంది. విభేదాల కారణంగా నాలుగేళ్లుగా దూరంగానే ఉంటున్నారు బాలా, ముత్తు మలర్. ఈ క్రమంలో పరస్పర అంగీకారంతో విడాకులకు అప్లై చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ జంటకు ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది.