తమిళ హీరో శివకార్తికేయన్ నేరుగా తెలుగు చిత్రంలో నటిస్తున్నారు. ‘ఎస్కే 20’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నది. అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నారు. మరియా ర్యాబోషప్క నాయిక. సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్స్‌పై నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహన్రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని నిర్మాతలు ప్రకటించారు. ఆగస్టు 31న వినాయక చవితి సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వారు వెల్లడించారు. భారత్‌లోని పుదుచ్చేరి, బ్రిటన్‌లోని లండన్ నేపథ్యంగా సాగే కథతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందిందీ సినిమా. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతాన్ని అందించారు.