హైదరాబాద్, జూలై 8(నమస్తే తెలంగాణ): తమిళ స్టార్ నటుడు శివకార్తికేయన్ గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగస్వాములయ్యారు. శనివారం తన సినిమా ‘మహావీరుడు’ ప్రచారంలో భాగంగా కేబీఆర్ పార్క్‌లో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా 17 కోట్ల మొక్కలు నాటడం అద్భుతమని ప్రశంసించారు.
అందరం కలిసి ప్రకృతి కోసం ఏదో ఒకటి చేద్దామని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా తాను కూడా ఒక మొక్కనాటినట్టు పేర్కొన్న శివకార్తికేయన్.. రాక్‌స్టార్ అనిరుధ్‌కు చాలెంజ్ విసిరారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగస్వాముడైన శివకార్తికేయన్‌కు ఈ కార్యక్రమ సృష్టికర్త, ఎంపీ సంతోష్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నాటిన మొక్క వీడియో, ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశారు.