Karthi Look from Sardar | ఈ మధ్య కాలంలో సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమైపోతున్నారు హీరోలు. ఎందుకంటే బయట పోటీ కూడా అలాగే ఉంది. ఒక్కో సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తున్నారు. స్టార్ హీరోలైన.. కుర్రహీరోలు అయినా ఎవరైనా కూడా క్యారెక్టర్ ఒప్పుకున్న తర్వాత దాని కోసం ఎంత మారిపోవడానికి అయినా సరే అంటున్నారు. తాజాగా మరో స్టార్ హీరో కూడా ఇదే చేశాడు. అతను ఎవరో కాదు.. కార్తి.
తమిళనాట తనకంటూ సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కార్తి.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన నటిస్తున్న సినిమా సర్దార్. ఇందులో తండ్రీ కొడుకులుగా నటిస్తున్నాడు కార్తి. ఈ మధ్య వరుసగా తెలుగు ఓల్డ్ టైటిల్స్ పై కన్నేశాడు ఈ హీరో. ఇప్పటికే పాత సినిమా టైటిల్స్ తో ఖైదీ, దొంగ, సుల్తాన్, కాష్మోరా, చిన్న బాబు లాంటి సినిమాలు చేశాడు కార్తి. ఇప్పుడు సర్దార్ సినిమాలో నటిస్తున్నాడు. ఐదేళ్ల కింద పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సినిమా కూడా సర్దార్ గబ్బర్ సింగ్ అనే టైటిల్ పెట్టారు. ఇప్పుడు ఇదే టైటిల్ తో ఈ తమిళ హీరో వస్తున్నాడు. పీఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తయింది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
ఇందులో కార్తి సరసన రాశి ఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన ఈ సినిమా స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తిగా గుర్తు పట్టకుండా మారిపోయిన కార్తీని చూసి షాక్ అవుతున్నారు అభిమానులు. గతంలో కూడా కొన్ని సినిమాల కోసం పూర్తిగా మేకోవర్ అయిపోయాడు కార్తీ. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. సినిమా కోసం ఈయన పెట్టే ఫోకస్ చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు. ఈ మధ్య కాలంలో సరైన విజయం లేని కార్తి సర్దార్ తో మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు.