సమాజం తాలూకు చీకటి కోణాల్ని, యథార్థ జీవన వ్యథల్ని వెండితెర దృశ్యమానం చేయడంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నారు బాలీవుడ్ దర్శకుడు మధుర్‌భండార్కర్. తాజాగా ఆయన అగ్ర నాయిక తమన్నాతో ‘బబ్లీ బౌన్సర్’ అనే చిత్రాన్ని మొదలుపెట్టారు. ఫాక్స్‌స్టార్ స్డూడియోస్, జంగ్లీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. మధుర్‌భండార్కర్ మాట్లాడుతూ ‘బౌన్సర్స్ టౌన్‌గా పేరుపొందిన అసోలా ఫతైపూర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. ఇందులో తమన్నా మహిళా బౌన్సర్‌గా నటిస్తున్నారు. భారతదేశంలో తొలి మహిళా బౌన్సర్ కథ ఇదేనని భావిస్తున్నా. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అన్నారు. తన కెరీర్లో ఛాలెంజింగ్ పాత్ర ఇదని, మధుర్‌భండార్కర్ దర్శకత్వంలో నటించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తమన్నా ఆనందం వ్యక్తం చేసింది.