Tamannaah -Vijay Varma | మొన్నటివరకు ప్రేమపక్షుల్లా విహరించిన మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మ రిలేషన్‌కి పులిస్టాప్ పడిందని కొద్ది రోజులుగా జోరుగా చర్చ నడుస్తుంది. ఇక వారిద్దరు కలిసి ఉండలేరని, ఎవరి దారులు వారు చూసుకున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. ఈ సమయంలో విజయ్ వర్మ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రిలేషన్‌షిప్‌ను కాపాడుకోవడం ఎంతో కష్టమైన పని . దాన్ని ఐస్‌క్రీమ్ తిన్నట్లుగా ఆస్వాదించాలి. అప్పుడే సంతోషంగా ఉంటాము. సంతోషాన్ని కాదు బాధ, కోపం, చిరాకు.. ఇలా ప్రతి అంశాన్ని స్వీకరిస్తూ ముందుకుపోతేనే జీవితం బాగుంటుంది. మరోవైపు ఒక బంధాన్ని సంతోషంగా మార్చుకొనే సమయంలో ఎలాంటి పరిస్థితులనైనా స్వీకరించాల్సి ఉంటుందని విజయ్ వర్మ అన్నారు.
ఇటీవల తమన్నా- విజయ్ వర్మ బ్రేకప్‌కి సంబంధించి కూడా అనేక ప్రచారాలు నడిచాయి. ఆ సమయంలో ఓ వేదికపై తమన్నా ప్రేమ గురించి మాట్లాడారు. నిస్వార్థమైన ప్రేమను నేను నమ్ముతాను. ప్రేమను ఎప్పుడైతే వ్యాపార లావాదేవీగా చూడటం మొదలుపెడతామో అప్పుడే సమస్యలు ఉత్పనన్నమవుతాయి అని ఓపెన్‌గా చెప్పుకొచ్చింది. తాను రిలేషన్లో ఉన్నప్పుడు కన్నా లేనప్పుడే చాలా ఆనందంగా ఉన్నాను. భాగస్వామి విషయంలో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు తప్పవు అని కూడా తమన్నా హెచ్చరించింది. విజయ్ వర్మ, తమన్నా దాదాపు రెండేళ్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కాని ఇటీవల తమన్నా, వర్మలు జంటగా కనిపించడమే లేదు. ఏ కార్యక్రమానికైనా విడివిడిగానే హాజరవుతుండడంతో అందరిలో అనేక అనుమానాలు కలిగాయి.
ఈ మధ్య రవీనా టాండన్ నివాసంలో జరిగిన హోలీ వేడుకల్లోనూ తమన్నా ఒంటరిగానే పాల్గొన్నారు.విజయ్ వర్మ సపరేట్గా వచ్చారు. సెలబ్రేషన్స్ కూడా విడివిడిగానే జరుపుకున్నారు. ఇక 2023లో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్ 2’లో తమన్నా, విజయ్ వర్మ నటించారు. ఈ సిరీస్ చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అప్పటి నుండి ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటూ కలిసి తిరిగారు. కాని ఈ మధ్య మాత్రం ఎక్కడా ఇద్దరు కలిసున్న ఫొటోలు కూడా లేవు. దీంతో ఈ జంట నిజంగా విడిపోయారని ప్రచారం మొదలైంది.