తమన్నాకు కోపం వచ్చించి. తనపై లేనిపోని పుకార్లును సృష్టిస్తున్నవారిపై ఆమె అంతెత్తు లేచింది. వివరాల్లోకెళ్తే.. పాత్రల డిమాండ్ మేరకు నటీనటులు బరువులు పెరగాల్సి వస్తుంది. ఒక్కోసారి బరువు తగ్గాల్సి వస్తుంది. ఇది కామన్. అయితే.. ఈ మధ్య బరువు బాగా పెరిగిన తమన్నా తాను చేయబోతున్న పాత్రల కోసం బరువు తగ్గేందుకు కొన్ని ఇంజెక్షన్లు వాడుతున్నదంటూ బాలీవుడ్ మీడియాలో వదంతులు మొదలయ్యాయి. దీనిపై తాజా ఇంటర్వ్యూలో స్పందించింది తమన్నా. ‘ఇలాంటి వార్తల వల్ల మీ కెరీర్‌కు ఉపయోగం లేదు.
ఈ క్రియేటివిటీని కెరీర్ ఎదుగుదలకు ఉపయోగిస్తే మంచిది. 15ఏండ్ల వయసు నుంచి నటిస్తున్నా. కెమెరా జీవితంలో భాగమైపోయింది. దాదాపు ఇరవై ఏళ్లుగా నన్ను చూస్తున్నారు. నాలో ఏమైనా మార్పు వచ్చిందా? నేను ఇప్పటికీ అలాగే ఉన్నా. ఇందులో దాచడానికి ఏం లేదు. టీనేజ్‌లో ఉన్నట్టే ఇప్పుడూ ఉన్నా. సాధారణంగా ప్రతి స్త్రీకి ప్రతి అయిదేళ్లకోసారి శరీరంలో మార్పులొస్తాయి. అది సహజం. అందుకే ఓకే శరీరాకృతితో కనిపించడం చాలా కష్టం. కానీ నేను అప్పుడెంత వెయిట్ ఉన్నానో, ఇప్పడు కూడా అంతే ఉన్నా’ అని చెప్పుకొచ్చారు తమన్నా.