Tamannaah | నాగసాధువు శివశక్తిగా తమన్నా.. గూస్ బంప్స్ గ్యారెంటీ అంటున్న ‘ఓదెల 2’ దర్శకుడు
తమన్నా భాటియా శివశక్తిగా పవర్ఫుల్ రోల్లో కనిపించనుంది. ‘ఓదెల 2’లో శివశక్తిగా ఆమె ఫస్ట్‌లుక్‌ను మహాశివరాత్రి సందర్భంగా చిత్రబృందం విడుదల చేశారు.
Tamannaah | తమన్నా భాటియా శివశక్తిగా పవర్ఫుల్ రోల్లో కనిపించనుంది. ‘ఓదెల 2’లో శివశక్తిగా ఆమె ఫస్ట్‌లుక్‌ను మహాశివరాత్రి సందర్భంగా చిత్రబృందం విడుదల చేశారు. ఈ పాత్రకోసం తమన్నా పూర్తిగా ట్రాన్స్ఫార్మేషన్ అయ్యారని, నాగసాదువు రూపంలో ఓ చేత దండం, మరో చేత ఢమరుకం, నుదిటిపై పసుపుకుంకుమలతో శివశక్తిగా తమన్నాను చూస్తుంటే థియేటర్లలో గూజ్బబ్స్ గ్యారెంటీ అని చిత్ర దర్శకుడు అశోక్ తేజ చెప్పారు.
కాశీ ఘాట్లపై నడుస్తూ కళ్లు మూసుకుని దేవుడ్ని ప్రార్థిస్తున్న రూపం ఆమె కెరీర్లోనే ప్రత్యేకమని, ఇది తమన్నా నుంచి ఎవరూ ఊహించని అవతారమని, ‘ఓదెల 2’ గ్రామ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్టశక్తుల నుంచి ఎలా కాపాడాడనే అంశాలు ఇందులో అద్భుతంగా ఉండబోతున్నాయని ఈ సినిమా క్రియేటర్‌గా వ్యవహరిస్తున్న సంపత్‌నంది తెలిపారు. హెబ్బాపటేల్, వశిష్ఠ ఎన్ సింహా ముఖ్యతారాగణంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్ ఎస్., సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, నిర్మాత: డి.మధు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

