ముంబై : మిల్కీ బ్యూటీ తమన్నా.. గ్రీన్ కలర్స్‌లో మెరిసిపోతోంది. ఆకుపచ్చ దుస్తుల్లో తెగ అట్రాక్ట్ చేస్తోంది. పండుగల సీజన్ కావడంతో.. తమన్నా భాటియా గ్రీన్ కలర్ ఔట్ఫిట్లో వెలిగిపోతున్నది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ మోడలింగ్ ఫోటోలను పోస్టు చేసింది. స్టయిలిస్టు సుకృతిగోవర్ రూపొందించిన గ్రీన్ ఔట్ఫిట్లో తమన్నా జిగేల్ మంటున్నది. బ్యాగీ ట్రౌజర్లను ధరించిన తెలుగు నటి ఆ దుస్తుల్లో స్టయిలిష్‌గా కనిపిస్తోంది. ఇటీవల ఓ పువ్వుల డ్రెస్సులోనూ తమన్నా కలర్ఫుల్గా దర్శనమిచ్చింది.