‘గలగల పారే ప్రవాహమే స్వచ్ఛంగా కనిపిస్తుంది. ఒకేచోట నిలిచిపోతే ఆలోచనల పదును తగ్గిపోతుంది. అందుకే నిత్యం షూటింగ్ వ్యవహారాలతో బిజీగా ఉండాలని కోరుకుంటా’ అని చెప్పింది మిల్కీబ్యూటీ తమన్నా. ప్రస్తుతం ఈ భామ తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. తన పదిహేనేళ్ల కెరీర్లో ఎప్పుడూ బోర్‌గా ఫీలైన సందర్భం లేదని..వృత్తిని అనుక్షణం ప్రేమిస్తుండమే కెరీర్లో రాణించడానికి కారణమని చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘ఓ సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమా సెట్లో అడుగుపెట్టాలని కోరుకుంటా. విరామం దొరికితే గత సినిమా తాలూకు హ్యాంగోవర్లోనే ఉండిపోతాం. అది మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రతి రోజు కొత్త వాతావరణంలోకి ప్రవేశిస్తూ..పాత్రలపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తేనే నటిగా సంతృప్తి దొరుకుతుంది’ అని పేర్కొంది. తాను సినిమా తాలూకు స్క్రిప్ట్ చదివినప్పుడే తన పాత్ర ఎలా ఉంటుందో ఊహించుకుంటానని..సెట్స్‌లో రిహార్సల్ చేయడం ఇష్టం ఉండదని తమన్నా చెప్పింది. ప్రస్తుతం ఈ సుందరి తెలుగులో ‘ఎఫ్-3’, హిందీలో ‘ప్లాన్ ఏ ప్లాన్ బి’ చిత్రాల్లో నటిస్తున్నది. ‘మాస్టర్‌చెఫ్’ తెలుగు వెర్షన్‌కు ప్రయోక్తగా వ్యవహరిస్తున్నది.