రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్
సిద్ధార్థ్, దివ్యాంశ కౌషిక్ జంటగా నటిస్తున్న సినిమా ‘టక్కర్'. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్నది.
సిద్ధార్థ్, దివ్యాంశ కౌషిక్ జంటగా నటిస్తున్న సినిమా ‘టక్కర్’. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ….‘ఈ ఆగస్టుకు నేను హీరోగా పరిచయమై 20 ఏండ్లవుతున్నది. ఇప్పటికీ నాకు మంచి అవకాశాలు వస్తుండటం సంతోషంగా ఉంది. నేను నటించిన పూర్తి కమర్షియల్ చిత్రమిది. దర్శకుడు కార్తీక్ నన్ను సరికొత్తగా తెరపై చూపించాడు. యాక్షన్, రొమాంటిక్ అంశాలతో సినిమా సాగుతుంది. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణకే దాదాపు 35 రోజుల సమయం వెచ్చించాం. దివ్యాంశ పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. ఈ ప్రేమకథ ఈ తరం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’ అన్నారు. దర్శకుడు కార్తీక్ జి.క్రిష్ మాట్లాడుతూ…‘ఇది నేటితరం సినిమా అని చెప్పుకోవచ్చు. సిద్ధార్థ్‌ను లవర్‌బాయ్‌లా కొత్తగా చూపిస్తున్నాను. లవ్, కామెడీ, రొమాన్స్ వంటి అంశాలుంటాయి. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది’ అన్నారు. సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ..‘గతంలో సిద్ధార్థ్ సినిమాలు ఎంతగా ఆదరణ పొందాయో చూశాం. ఈ సినిమా కూడా అదే స్థాయి సక్సెస్ అందుకుంటుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

