The Crew | టాలీవుడ్, బాలీవుడ్లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ నటీమణుల్లో టాప్లో ఉంటుంది టబు (Tabu). ఈ సీనియర్ హీరోయిన్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటిస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వీడియో రూపంలో అందించారు మేకర్స్. కరీనాకపూర్ ఖాన్, కృతిసనన్, టబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం The Crew (వర్కింగ్ టైటిల్). ఈ చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయనున్నట్టు తెలియజేస్తూ కొత్త వీడియోను షేర్ చేశారు.
కొత్త పోస్టర్, కొత్త టైటిల్ను త్వరలోనే లాంఛ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రాజేశ్ కృష్ణన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఏక్తాకపూర్, రియాకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పంజాబీ యాక్టర్ దిల్జీజ్ దోసాంజ్, కపిల్ శర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో టబు, కృతిసనన్, కరీనాకపూర్ ఖాన్ ఎయిర్హోస్టెస్లుగా నటిస్తున్నట్టు వీడియోతో క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్. మరి ఎలాంటి కథాంశంతో ప్రేక్షకులను అలరిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స నెలకొంది.
TABU – KAREENA – KRITI SANON: ‘THE CREW’ RELEASE DATE LOCKED… 29 March 2024 is the release date of #TheCrew… Stars #Tabu, #KareenaKapoorKhan, #KritiSanon, #DiljitDosanjh and #KapilSharma [sp app].
The makers plan to launch #NewPoster and #NewTitle in few days.#TheCrew is… pic.twitter.com/Y2rWHSOPGW
— taran adarsh (@taran_adarsh) February 2, 2024