Taapsee Pannu | బాలీవుడ్ చిత్రసీమలో గ్రూపులు కట్టడం సహజమైన విషయమేనని, అక్కడ పలుకుబడి ఉంటేనే పనులు జరుగుతాయని చెప్పింది అగ్ర కథానాయిక తాప్సీ. హిందీ చిత్రసీమలో ఒకప్పుడు తనను ఉద్దేశ్యపూర్వకంగా పక్కన పెట్టారని ఇటీవల గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రా చేసిన వ్యాఖ్యలపై తాప్సీ పై విధంగా స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘బాలీవుడ్లో క్యాంపులు కొత్తేమీ కాదు.
తమకు అనుకూలంగా ఉండేవారు, సన్నిహితులకే ఎక్కువ అవకాశాలు దక్కుతాయి. క్యాస్టింగ్ ఏజెన్సీల్లో కూడా ఫేవరేటిజం ఉంటుంది. ఇలాంటి విషయాల్ని ముందే తెలుసుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్ని కూడా తట్టుకొని విజయం సాధిస్తామనే నమ్మకం ఉండాలి. దృఢమైన వ్యక్తిత్వం ఉన్నవారు ఎవరి అండ లేకున్నా సక్సెస్ అవుతారు’ అని చెప్పుకొచ్చింది.