Taspsee Pannu | తాప్సీ పన్నుకు చారెడు కళ్లే అలంకారం. ఆ చూపులు మ్యాజిక్ చేస్తాయి. టపటపా కొట్టుకునే కనురెప్పలు మ్యూజిక్ వినిపిస్తాయి. ఆ విన్యాసాలకు ప్రేమ సన్యాసులైపోయినవారు ఎంతోమంది. అందుకేనేమో, ముందుజాగ్రత్తగా కళ్లజోడు పెట్టుకోవడం ప్రారంభించింది తాప్సి. ‘నాకు ైస్టెల్ ఎంత ముఖ్యమో, కంఫర్ట్ అంతే ప్రధానం’ అంటూ కళ్లజోడు సవరించుకుంటుంది.
గాగుల్స్ పట్ల ఆమె ప్రేమను గూగుల్‌లో చూసిన వోగ్ ఐవేర్ కంపెనీ తన యాభై ఏండ్ల పండుగ సందర్భంగా తాప్సిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. తమ ఉత్పత్తులన్నీ సమర్పించుకుంది. ఇంకేముంది, రోజుకో చష్మా.. పూటకింత చరిష్మా! ‘ప్రతి మనిషిలోనూ ఓ సూపర్‌స్టార్ ఉంటారు’ అనేది క్యాంపెయిన్ నినాదం.